VIDEO: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

GNTR: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగాకూటమి పాలన సాగుతుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. 18వ డివిజన్ శ్రీనివాసరావుపేట 4వ లైన్లో సీసీ రహదారి, కాల్వల నిర్మాణానికి శుక్రవారం మాధవి శంకుస్థాపన చేశారు. రూ.20 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకొని రావాలని చెప్పారు.