వృద్ధురాలిని రక్షించి వృద్ధాశ్రమంకు తరలింపు

వృద్ధురాలిని రక్షించి వృద్ధాశ్రమంకు తరలింపు

NRPT: నారాయణపేట రోడ్లపై దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న సత్యమ్మ అనే వృద్ధురాలిని ట్రాఫిక్ SI కృష్ణ చైతన్య గుర్తించి మానవత్వంతో ఆదుకున్నారు. ఆమెను ఆర్డీవో కార్యాలయానికి తీసుకెళ్లగా, ఆర్డీవో ఆదేశాల మేరకు తాత్కాలికంగా వృద్ధాశ్రమానికి తరలించారు. వృద్ధురాలి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి, సురక్షితంగా ఇంటికి చేర్చే వరకు అవసరమైన వసతులు కల్పించాలని అధికారులు ఆదేశించారు.