VIDEO: జనసేనకు బాహుబలిల బాలినేని శ్రీనివాసులు రెడ్డి

ప్రకాశం: మహిష్మతి సామ్రాజ్యాన్ని కాపాడడానికి బాహుబలి ఎలా అండగా నిలిచారో, ప్రకాశం జిల్లాలో జన సైనికులను, వీర మహిళలను కాపాడడానికి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వచ్చారని జనసేన కొండేపి ఇంచార్జ్ మనోజ్ కుమార్ అన్నారు. బుధవారం అర్ధరాత్రి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్లలో జనసేన ప్రభఫై మనోజ్ జనసైనికులను ఉత్సాహపరిచారు. జనసేన అంటే ఒక నమ్మకం, ధైర్యం, గౌరవం అన్నారు.