నేటి నుంచి ప్రారంభంకానున్న బ్యాడ్మింటన్ పోటీలు

VSP: అఖిల భారత అంతర్ రైల్వే బ్యాడ్మింటన్ పోటీలు ఇవాళ నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశాఖలోని రైల్వే స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయి. దేశంలోని వివిధ రైల్వే డివిజన్ల నుంచి జట్లు రానున్నాయని తెలిపారు. నేడు పోటీలను రైల్వే డీఆర్ఎం లలిత్బహ్రా ప్రారంభిస్తారని నిర్వాహకులు చెప్పారు.