'పిల్లలకు పోషక విటమిన్లు అందించాలి'
MHBD: తొర్రూరు(M) కంటాయపాలెంలో అంగన్వాడీ సెంటర్-1లో ఇవాళ పోషణ పక్వాడ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగీత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు అన్ని పోషక విటమిన్‌లు అందే విధంగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఆశ వర్కర్ సంధ్య, అంగన్వాడీ టీచర్లు సురేఖ, పద్మ, ఆయా సుభద్ర పాల్గొన్నారు.