ఆస్ట్రేలియా మంత్రులతో పియుష్ గోయల్ భేటీ
ఆస్ట్రేలియా మంత్రులు డాన్ ఫారెల్, ఆండ్రూ గైల్స్‌తో కేంద్రమంత్రి పియూష్ గోయల్ సమావేశమయ్యారు. ఈ నిర్మాణాత్మక చర్చలు భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాయి. ఇరు దేశాల పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి, సమతుల్యమైన సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (CECA)పై దృష్టి సారించారు. ఈ భేటీ ఇరు దేశాల వాణిజ్య సంబంధాలకు కీలకం కానుంది.