నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం 586.20 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు, నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 301.3570 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. ఇన్‌ ఫ్లోగా 1,45,797 క్యూసెక్కులు నీరు వస్తుండగా, ఔట్‌ ఫ్లో 2,15,249 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.