మేనల్లుడిపై వేడి గరిటెతో వాతలు పెట్టిన మామ

మేనల్లుడిపై వేడి గరిటెతో వాతలు పెట్టిన మామ

ELR: ఉంగుటూరులో 11 ఏళ్ల మేనల్లుడికి మామ వాతలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాలిలా.. విజయవాడకు చెందిన బాలుడు పెంటపాడులో ఓ వసతి గృహంలో 5వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవుల నిమిత్తం మామ ఇంటికి వెళ్లాడు. మంచంపై మూత్రం పోశాడని బాలుడి శరీరంపై వేడి గరిటెతో వాతలు పెట్టాడు. దాదాపు బాలుడిని చంపే ప్రయత్నం చేశాడు. లైంగిక దాడికి కూడా పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.