రష్యా, ఇరాన్‌కు ఇజ్రాయెల్ షాక్
ఇరాన్‌కు అన్ని వనరులు కట్ చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇటీవల ఇరాన్-రష్యా మధ్య ఆయుధాల సరఫరాకు కీలకమైన కాస్పియన్ సముద్రం మార్గాన్ని టార్గెట్ చేసింది. ఇరాన్‌లోని బందర్ అన్జాలీ పోర్టుపై దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఇరాన్-రష్యాల మధ్య మిసైల్స్, డ్రోన్లు, గన్స్ మొదలైనవి సరఫరా కావడానికి ఈ పోర్టు కీలకం. ఈ దాడితో ఇరు దేశాలకు ఇజ్రాయెల్ భారీ నష్టం కలిగించింది.