గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం: MLA
MBNR: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల బాలస్వామిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తమ పార్టీ తప్పకుండా నెరవేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.