VIDEO: విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపల్
GDWL: ఉండవెల్లి మండలంలో అలంపూర్ చౌరస్తాలో మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థులను ప్రిన్సిపల్ విచక్షణరహితంగా చితకబాదిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పదో తరగతి విద్యార్థుల పుస్తకాలు తీసుకున్నారని కారణంతో 15 మంది విద్యార్థులను సోమవారం సాయంత్రం కర్రలతో దారుణంగా కొట్టడంతో విద్యార్థులు అల్లాడిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.