రోడ్డు ప్రమాదం.. ఆరుగురికి గాయాలు
CTR: వెదురుకుప్పం ప్రాంతంలో తిరుపతికి బయలుదేరిన యల్లంపల్లి కుటుంబ సభ్యుల ఆటోను తంగేలి మిట్ట సమీపంలోని మధ్యలవంక వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిద్ధమ్మ, సుశీల, మోహన్, వెంకటేష్‌తో పాటు ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు వారిని 108 అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.