‘మార్నింగ్ వాక్‌తో ప్రజల వద్దకు‘ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..
NRML: మార్నింగ్ వాక్‌తో ప్రజల వద్దకు అనే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదివారం ఖానాపూర్ పట్టణంలోని పలు వార్డులలో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీటి సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలను గురించి కాలనీవాసులతో ముచ్చటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వార్డులలో సమస్యలు ఉంటే మున్సిపాలిటీ అధికారులకు లేదా నాయకులకు తెలపాలని సూచించారు.