పూలేకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

పూలేకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

CTR: నగరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొని జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆయన బలంగా విశ్వసించారన్నారు.