ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
TG: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 11 నుంచి 26వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు ఒక్కో పేపర్‌కు రూ.25 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించుకోవచ్చని వెల్లడించారు. పరీక్షలను మార్చి/ఏప్రిల్-2026లో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.