VIDEO: జగన్‌ను కలిసిన వృద్ధ బాధితరాలు
GNTR: తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను రాయపూడికి చెందిన 90 ఏళ్ల శేషగిరమ్మ బుధవారం కలిశారు. అమరావతి కోసం తన భూమిని అక్రమంగా లాక్కున్నారని వాపోయారు. పరిహారం ఇవ్వకుండా సీఆర్డీఏ అధికారులు మోసం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదన్నారు. దీనికి స్పందించిన జగన్.. ఆమెకు న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.