స్కూల్‌లో అసభ్యకర నృత్యాలు
పశ్చిమ బెంగాల్‌లోని ఒక పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమం తీవ్ర వివాదాస్పదమైంది. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ఓ సీబీఎస్‌ఈ పాఠశాలలో యువతులు టవల్స్ కట్టుకుని బాలీవుడ్ పాటలకు నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన NHRC.. పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.