బీటీ రోడ్డు పనులకు శ్రీకారం..!

బీటీ రోడ్డు పనులకు శ్రీకారం..!

NGRL:  బిజినేపల్లి మండలంలోని కల్వకుంట తండా నుంచి మాండి మాన్య నాయక్ తండా వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మంజూరైన రూ.71 లక్షల నిధులతో ఈ రోడ్డు నిర్మాణాన్ని సర్పంచ్ సరోజ మాన్య నాయక్ ప్రారంభించారు. రోడ్డు పూర్తయితే గిరిజన ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుందని గ్రామస్థులు పేర్కొన్నారు.