మండలంలో గ్యాస్ కొరతలేదు: తహసిల్దార్ ధనలక్ష్మి

మండలంలో గ్యాస్ కొరతలేదు: తహసిల్దార్ ధనలక్ష్మి

PLD: క్రోసూరు మండలంలో ఎలాంటి సిలిండర్ కొరత లేదని క్రోసూరు ఇంఛార్జ్ తహసిల్దార్ ధనలక్ష్మి తెలిపారు. ప్రజలు వదంతులు నమ్మి ఇబ్బందులు పడవద్దు అన్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న వారు ఏజెన్సీ ద్వారా సత్వరమే పంపిణీ జరుగుతుందన్నారు. గ్యాస్ నిల్వలు చేయరాదన్నారు. మండల ప్రజలందరూ సహకరించి గ్యాస్ సరఫరా సక్రమంగా కొనసాగేలా సహకరించాలన్నారు.