నేడు సత్తుపల్లిలో విద్యుత్ సరఫరా అంతరాయం

నేడు సత్తుపల్లిలో విద్యుత్ సరఫరా అంతరాయం

KMM: సత్తుపల్లి పట్టణంలో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. 33/11 కేవీ సబ్ స్టేషన్‌ల్లో మరమ్మతులు చేపట్టనున్నందున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ ఉండదని టౌన్ ఏఈ శరత్ బాబు తెలిపారు. జలగం నగర్, వేంసూర్ రోడ్, గాంధీ నగర్, ద్వారకాపురి కాలనీలలో చెట్ల కొమ్మలను తొలగించేందున ఈ అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.