మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన
NLR: కందుకూరు మండలంలోని ఓగురు గ్రామంలో ఆదివారం సాయంత్రం పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐ అన్వర్ బాషా, రూరల్ ఎస్సై మహేంద్ర పాల్గొని గ్రామ ప్రజలకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వివరించారు. ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తు చేశారు.