గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కోనసీమ: ముమ్మిడివరం మండలం పసువుల్లంక సలాది వారి పాలెం వద్ద గోదావరిలో ఇవాళ గుర్తుతెలియని మృతదేహం లభ్యం అయింది. గోదావరిలో ఉన్న మత్స్యకారులు వేట పడవలకు ఆనుకుని నీటిలో మొఖం మునిగిన మృతదేహం స్థానికులకు కనబడింది. వెంటనే ముమ్మిడివరం పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.