సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన ఎంపీ

కర్నూలు: రూరల్ మండలంలోని కొత్తకోట గ్రామానికి చెందిన ఈడిగ రాఘవేంద్రకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ. 30,500 వేల చెక్కును గురువారం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తన కార్యాలయంలో బాధితుడికి అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు రావడానికి కృషి చేసిన ఎంపీ నాగరాజుకు రాఘవేంద్ర కృతజ్ఞతలు తెలిపారు.