ఆధ్యాత్మికతోనే గ్రామాలలో మానసిక ప్రశాంతత

SKLM: ఆధ్యాత్మిక తోనే గ్రామాలలో, సమాజంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. శనివారం శ్రీకాకుళం విశాఖ ఏ కాలనీలో నిర్మిస్తున్న నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం నిర్మాణం చేపడుతున్న సందర్భంగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలన్నారు.