అక్షరాంధ్ర పరీక్షకు 99.9 శాతం హాజరు

అక్షరాంధ్ర పరీక్షకు 99.9 శాతం హాజరు

WG: జిల్లాలో అక్షరాంధ్ర లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మొత్తం 60,865 మంది అభ్యర్థులకు గాను 60,829 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాను నూరు శాతం అక్షరాస్యత దిశగా తీర్చిదిద్దేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.