ఉపాధి వేతన దారుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

SKLM: మెలియాపుట్టి మండలంలో గురువారం పర్యటించేందుకు వెళ్తూ.. పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మార్గమధ్యలో చీపురుపల్లి వద్ద ఉపాధి హామీ వేతన దారులతో మాట్లాడారు. ఉపాధి హామీ వేతనదారుల వివిధ సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఉపాధి పనులు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.