చీరాలలో పోలీసుల వినూత్న కార్యక్రమం
BPT: చీరాల పట్టణంలో ఆదివారం పోలీసులు రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమం చేపట్టారు. రోడ్డు భద్రత, హెల్మెట్ వాడకంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో 'వాక్ ఫర్ చీరాల' పేరుతో వన్ టౌన్ పోలీసులు ర్యాలీని నిర్వహించారు. సీఐ సుబ్బారావు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణ రక్షణకు మార్గమని వివరించారు.