రూ.కోటితో నాలా నిర్మాణం.. 3 నెలల్లో పూర్తి: కార్పొరేటర్
MDCL: చిల్కానగర్ డివిజన్ పరిధిలోని అజ్మత్ నగర్ ఇరిగేషన్ నాలాపై రూ. కోటి అంచనా వ్యయంతో నాలా నిర్మాణం జరుగుతుంది. నేడు నాలా నిర్మాణపు పనులను స్థానిక కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముదిరాజ్ పరిశీలించారు. ఈ నిర్మాణాన్ని మూడు నెలల్లోనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నిర్మాణం పూర్తి చేసే వరకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.