'గాంధీ జయంతికి మాంసం విక్రయాలు నిషేధం'
GNTR: గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీన పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో చికెన్, మటన్, చేపలు, ఇతర మాంసం విక్రయాలను నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు ఇవాళ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా మాంసం విక్రయాలు జరిపితే ప్రజారోగ్య చట్టం 1965 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.