తిరుమలలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం
TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆస్థానాన్ని పురస్కరించుకుని ఉదయం 9గంటల నుంచి 11 గంటల వరకు తిరుమంజనం చేశారు. ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అర్చకులు పాల్గొన్నారు.