చీపురుపల్లిలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు
VZM: చీపురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జి.అగ్రహారంలో ఎంపీడీవో సురేష్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. జేసీబీ, ట్రాక్టర్‌లతో చెత్తను తరలించి వీధులను శుభ్రం చేసి సున్నం, బ్లీచింగ్ పిచికారీ చేయించారు. అలాగే స్మశానం రోడ్డులోని పిచ్చి మొక్కలను కూడా తొలగించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వై.ఝాన్సీరాణి పాల్గొన్నారు.