TDP నాయకుడికి ఎమ్మెల్యే నివాళులు

TDP నాయకుడికి ఎమ్మెల్యే నివాళులు

TPT: పుత్తూరు మండలం గేట్ పుత్తూరుకు చెందిన టీడీపీ నాయకుడు సుధాకర్ మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ ఆయన ఇంటికి చేరుకున్నారు. సుధాకర్ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ పరామర్శలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.