జిల్లాలో ఆగష్టు చివరి వరకు ఆంక్షలు: DSP

W.G: నరసాపురం సబ్ డివిజన్ పరిధిలో ఆగష్టు 25 నుంచి 31వరకూ సెక్షన్ 30 అమలులో ఉంటుందని నరసాపురం డీఎస్పీ డాక్టర్ జి. శ్రీవేద తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించకూడదన్నారు. జరపాలనుకుంటే ముందుగా సబ్ డివిజన్ పోలీస్ అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశాలు, లౌడ్ స్పీకర్లు, డీజేలు నిషేధమనన్నారు.