VIDEO: పట్టణంలో పడకేసిన పారిశుద్ధ్యం

VIDEO: పట్టణంలో పడకేసిన పారిశుద్ధ్యం

WNP: జిల్లాలోని 27వ వార్డులో డ్రైనేజీ లేకపోవడంతో కొంత భాగంలో మురుగునీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. నివాసాల మధ్య ఉన్న ఓపెన్ ప్లాట్లలో మురుగునీరు చేరడంతో దోమలు, పందులకు ఆవాసంగా మారాయి. పందుల స్వైరవిహారం, దోమల బెడద విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.