VIDEO: మేడారం జాతర పనులపై మంత్రుల ఆకస్మిక తనిఖీ
MLG: మేడారంలో జాతర సందర్భంగా చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్, స్థూపం రోడ్, జంపన్నవాగు రోడ్డు పనులు, క్యూ లైన్లు, స్నాన ఘట్టాలు,గద్దెల ప్రాంత పునరుద్ధరణ పనులను తనిఖీ చేశారు. అనంతరం హరిత హోటల్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.