ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: కలెక్టర్
NZB: గ్రామపంచాయతీ, సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేలా సన్నద్ధం కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కలెక్టరేట్లో మంగళవారం బీఎల్పీవో, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.