ఒంగోలులో మంత్రుల విజయోత్సవ ర్యాలీ

ఒంగోలులో మంత్రుల విజయోత్సవ ర్యాలీ

ప్రకాశం: రాజధాని అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఒంగోలులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, డాలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు కొవ్వొత్తులతో గురువారం ర్యాలీ జరిపారు. రాజధాని బిల్లు కు ఆమోదం లభించడం పట్ల మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.