అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

GNTR: గుంటూరు రైలుపేట ప్రభుత్వ ఆసుపత్రి డివైడర్ వద్ద శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.