ఆసుపత్రిలో మహిళ మెడలో పుస్తెలతాడు చోరి
WGL: ఆరేపల్లి సమీపంలోని రిలీఫ్ ఆస్పత్రిలో పక్షవాతంతో చేరిన రోగి రమాదేవి మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు చోరికి గురైంది. ములుగు జిల్లా లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన రమాదేవి స్కానింగ్ కోసం వెళ్లే ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీ ఫుటేజ్ పరిశీలనలో రేడియాలజీ విభాగానికి వెళ్లే ముందు ఆమె ఒంటిపై నగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.