'వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు'

KMM: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంగా వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలే తప్ప నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వినీత్ పలువురికి చికిత్స చేస్తుండగా పరిశీలించారు. అనంతరం ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్‌తో మాట్లాడి పరీక్షలు, మందుల లభ్యతపై ఆరా తీశారు.