VIDEO: ఐనవోలు పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలించిన సీపీ
HNK: ఐనవోలు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఇవాళ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సిబ్బంది సమన్వయాన్ని ఆయన పరిశీలించారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని అధికారులకు సూచించారు.