ఐకేపీ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్

ఐకేపీ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్

SDPT: బస్వాపూర్ ఐకేపీ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ కె. హైమావతి సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, తాగునీరు, టార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణాకు లారీల కొరత లేకుండా చూడాలని ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లకు సూచించారు. తేమ శాతం పరిశీలించి వెంటనే ధాన్యం లోడింగ్ చేయాలన్నారు.