కంకిపాడు సెంటర్‌లో రోడ్డుకు మరమ్మతులు
కృష్ణా: కంకిపాడు సెంటర్‌లో లాకురోడ్డు ప్రాంతంలో మెయిన్ రోడ్ నుంచి సీసీ రోడ్డు వరకు ఉన్న రహదారికి అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఆరేళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం లభించింది. దెబ్బతిన్న రహదారి వల్ల ఇన్నాళ్లూ వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొనగా, తాజాగా పనులు ప్రారంభం కావడంతో రాకపోకలు సులభతరం కానున్నాయి.