'విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి'

RR: షాద్‌నగర్ పట్టణంలోని మినీ స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేస్తానని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. మినీ స్టేడియంలో అభివృద్ధి పనులను నాయకులతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మినీ స్టేడియాన్ని రూ. 2.75కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు.