వాటర్ షెడ్ మహోత్సవ్ పై సోషల్ మీడియా పోటీలు

వాటర్ షెడ్ మహోత్సవ్ పై సోషల్ మీడియా పోటీలు

PPM: వాటర్‌షెడ్‌ మహోత్సవ్‌ - 2025 పై సోషల్‌ మీడియా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డా. ఎన్‌ ప్రభాకర రెడ్డి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పోటీలు ఈనెల 31 వరకు కొనసాగుతాయని, వాటర్‌షెడ్‌ అభివృద్ధి పనులు, నీటి సంరక్షణ నిర్మాణాలు, ఆగ్రోఫారెస్టి/ హార్టికల్చర్‌ కార్యకలాపాలపై రీల్స్, ఫోటోగ్రాఫ్‌లు రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయాలన్నారు.