విధుల్లో చేరిన గ్రామ పరిపాలన అధికారులు

KMM: మధిర మండలంలో కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులు ఇవాళ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా వారు తహసీల్దార్ రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసి, తమ జాయినింగ్ రిపోర్టులను అందజేశారు. అనంతరం వారు అధికారికంగా తమ విధులను స్వీకరించారు. వీరికి తహసీల్దార్ శుభాకాంక్షలు తెలిపి పలు సూచనలు చేశారు. ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు.