VIDEO: జైనథ్ మండలంలో రోడ్డు ప్రమాదం.!
ADB: జైనథ్ మండలంలోని నిరాల గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం, కారు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, సిబ్బంది గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు గాయపడ్డ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.