ఘనంగా ప్రారంభమైన దుర్గమ్మ తీర్థ మహోత్సవం
E.G: మురారి దుర్గమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వేప చెట్టులో వెలసిన దుర్గమ్మకు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.