VIDEO: జల్లాపురం రహదారి దుస్థితి
GDWL: జల్లాపురం నుంచి మారమునగాల గ్రామాలకు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. గుంతలు, కంకరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి కొత్త బీటీ రహదారి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.