తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం: కలెక్టర్

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం: కలెక్టర్

JGL: తుఫాన్ ప్రభావంతో తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ బీ. సత్య ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కోరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామంలో ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆయన తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ పాల్గొన్నారు.